Album: Naa Jeevana Sandhya
Singer: V. Ramakrishna, P. Susheela
Music: Sathyam
Lyrics: Veturi Sundararama Murthy
Label: Saregama
Released: 1977-12-31
Duration: 06:00
Downloads: 52424
నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది ఆ రూపమే
అపురూపమై అమరదీపమై వెలిగింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత
ఉదయించింది శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది గరిస సదపమ
గమ దమదని దనిరిని గరిగరిసా సదసదపా మపగా కళకే కళగా విరిసి
నా కల నిజమై పండింది శిలకే కదలిక రాగా శిల్పమే కదలి
ఆడింది కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది ఆరు
ఋతువుల ఆమని కోయిల మనసే ఎగసి పాడింది నా జీవన
సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది పొద్దుపొడుపులో అరుణిమలే చెలి దిద్దు
తిలకమై చివురించే ఇంద్రధనుస్సులో రిమరిమలే చెలి పైట జిలుగులే సవరించే ఆ
చల్లని చూపుల ఊపిరి సోకిన ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన
వెదురు వేణువై పలికింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత
ఉదయించింది పలుకే పాడని పాట చిరునవ్వు పూలకే పూత గరిసా సదపమా
గమద మదని దనిరిని గరిగరిసా సదసదపా మపగా నడకే నెమలికి ఆట
లే నడుము కలలకే కవ్వింత కలలుగన్న నా శ్రీమతి రాగా ఈ
బ్రతుకే పరిమళించింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత
ఉదయించింది ఆ రూపమే అపురూపమై అమరదీపమై వెలిగింది నా జీవన
సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది