Album: Naa Manusukemayindi
Singer: Udit Narayan, Nithya Santhoshini
Music: Koti
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:48
Downloads: 5734008
నా మనసుకేవయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా నాకు
అలాగె ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోలోపల మన ఇద్దరికి తెలియనిది
ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది
నా మనసుకేవయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా జంటగా వెంట
నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ అందుకే నాకు నువ్వంటే మాటలో
చెప్పలేనంత ప్రేమ పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి పెంచుకున్న మత్తులో
పడి మతే చెడి గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని
నా మనసుకేవయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా
ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ ఎప్పుడో
అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న
నీ రూపురేఖ ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ లోకమంటె
ఇద్దరే అదే మనం అని స్వర్గమంటె ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని నా మనసుకేవయింది
నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా మన ఇద్దరికి తెలియనిది
ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది