Album: Naa Paata
Singer: Sunitha Upadrasta
Music: S.V. Krishna Reddy
Lyrics: Chandrabose
Label: Aditya Music
Released: 2014-04-07
Duration: 05:46
Downloads: 314451
నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు
పాట నా పాట తేట తెలుగు పాట నా పాట
తేనెలొలుకు పాట పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట నీలిమబ్బులకు స్నానం
పోసే చిటపట పాట రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట కన్నతల్లులను
నిద్దుర పుచ్చే ఊయల పాట దైవాన్ని మేలుకొలిపే దీపధూపాల పాట నా
పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట
లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట పూత వయసు పుస్తకాలలో దాచుకున్న
పాట చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట పడుచు గుండె
ప్రాంగణాలలో మోగుతున్న పాట అందరు మెచ్చే పాట, ఒకరికి అంకితమిచ్చే పాట
అందరు మెచ్చే పాట ఒకరికి అంకితమిచ్చే పాట పదాలు అన్నీ
బోయీలై ప్రేమ పల్లకిని మోసే నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట నీస గాస నిసగా దమద
మగమ సగస గమగ మదమ దనిద నిస నిసమగస దనిస
పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట నదులలోని
జీవరాగమే నింపుకున్న పాట వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట
ప్రకృతి నేర్పిన పాట చక్కని ఆకృతి దాల్చిన పాట ప్రకృతి నేర్పిన
పాట చక్కని ఆకృతి దాల్చిన పాట మనస్సు గెలిచిన పురుషునికి స్వరాల
అర్చన చేసే నా పాట తేట తెలుగు పాట నా పాట