Album: Nagonthu Sruthilona
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: K. V. Mahadevan
Lyrics: Aatreya
Label: Aditya Music
Released: 2019-05-18
Duration: 04:12
Downloads: 2130551
నా గొంతు శృతిలోన నా గుండె లయలోన ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల నా గొంతు శృతిలోన నా గుండె
లయలోన ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల నా
గొంతు శృతిలోన నా గుండె లయలోన ఒకమాట పదిమాటలై అది
పాటకావాలని ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని అన్నిటా ఒక మమతే
పండాలని అది దండలో దారమై ఉండాలని అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి
పోవాలని పాడవే ... పాడవే ... కోయిల పాడుతూ పరవశించు జన్మ
జన్మల నా గొంతు శృతిలోన నా గుండె లయలోన ప్రతిరోజు
నువు సూర్యుడై నన్ను నిదురలేపాలని ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరుజన్మ రావాలని కోరికే
ఒక జన్మ కావాలని అది తీరకే మరుజన్మ రావాలని వలపులే రెక్కలుగా
వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవే... పాడవే... కోయిల పాడుతూ పరవశించు జన్మ
జన్మల నా గొంతు శృతిలోన నా గుండె లయలోన పాడవే పాడవే
కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల