Album: Nee Valu Jada
Singer: S.P. Balasubrahmanyam, Sunitha Upadrasta
Music: Mani Sharma
Lyrics: Jonnavithula Ramalingeswara Rao
Label: Aditya Music
Released: 2018-10-09
Duration: 04:53
Downloads: 215755
చందమామ లాంటి మోమునువ్వు పువ్వు లాంటి ముక్కు దొండపండు లాంటి పెదవికలువ
పూల వంటి కళ్ళూ జామపండు లాంటి బుగ్గబెల్లం ముక్క లాంటి గడ్డం
వలపుశంఖమంటి కంఠం ఇంకాఇంకా ఎన్నోఎన్నో యవ్వనాల నవ నిధులు కవ్వించి చంపే
వన్నీ అన్నీ ముందువైపునే ఉంటే నువ్వొక్కదానివే వెనకనే ఎందుకున్నావే జడా?′
హా ఆ బుగ్గలు సాగదీస్తావ్ ముక్కుని పిండుతావ్ పెదవులు జుర్రుకుంటావ్ హు
గడ్డాన్ని కొరుకుతావ్ ముద్దులూగుద్దులూగిచ్చుళ్ళునొక్కుళ్ళు అదేవిటంటే ఆరళ్ళుగీరళ్ళు శౄంగారం పేరుతో గింగిరాలు తిప్పువానేఇలా
వెనకాలే ఉన్నా నీ పక్క చూపులూవెనక చూపులూ ఎంచక్కా కనిపెడుతున్నా అవసరమైతే
పనిపడుతున్నా ఓ వాలుజడా మల్లెపూల జడా ఓ పాము జడా
సత్యభామ జడా నువ్వలిగితే నాకు దడ ఓ పట్టుజడా రసపట్టు జడా
బుసకొట్టు జడా నసపెట్టు జడా ఇపుడెందుకే ఈ రగడా ఓ వాలుజడా
మల్లెపూల జడా ఓ పాము జడా సత్యభామ జడా వీపుకి
మెడకీ భుజములకీ తగు అందం తెచ్చే జడ ఈ తగవులేలనే జడ
కులుకుల నడుముకి వెనకన తిరుగుతూ కళకళలాడే జడనను కనికరించవే జెడా
పిరుదుల బిరుదుల జడగంటలతో జగతికి చాటే జడా నా పొరపాటేమే జడా
అత్తరి ఇత్తరి అనుమానాలా తత్తరి బిత్తరి జడా ఎద కత్తిరించకేజడా కనికట్టు
జడా కనిపెట్టు జడా పనిపట్టు జడా పనిపెట్టు జడా నిను విడువని
ప్రేమికుడా వడిసేలల్లే తిప్పితే జడా గుండెలోన దడ దడ ఏ
గుబులు రేపకే జడా నడుము తిప్పుడూ నాగస్వరానికి నాగుపామువే జడా నగుమోము
చూపవే జడా జడకోలాటం సరసమె కాని జగడం కాదే జడా నను
సరసకు రానీ జడా జడని దువ్వనీపొగడని మొగుడూ జడపదార్ధమే జడా నిను
దువ్వనియ్యవే జడా కనువిందు జడా నను పొందు జడా సరసాల జడా
ఇక చాలు జడా ఏ నాటికి నీవాడా జజ్జడాంజగడ జజ్జడాం