Album: Anaganaga Kadala
Singer: Karthik, Sumangali
Music: Devi Sri Prasad
Lyrics: Sahithi
Label: Aditya Music
Released: 2018-10-09
Duration: 05:05
Downloads: 2586470
హొయ్ అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే అరె కనులను వెలిగించే
ప్రతి ఉదయం మనదేలే లోకాన చీకటిని తిడుతూనే వుంటామా ఓ చిన్న
దీపాన్ని వెలిగించుకోలేమా ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే... చిరునవ్వేనమ్మా
అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే అరె కనులను వెలిగించే ప్రతి
ఉదయం మనదేలే హేలా... హేలాల జాబిలి కంట్లో కన్నీళ్ళా... హేలా
హేలాల వెన్నెల కురవాలా హొయ్... బాధలో... కన్నులే... కందినంత మాత్రానా
పోయిన కాలము పొందలేముగా రేగిన గాయమే ఆరనంత మాత్రాన కాలమే సాగక
ఆగిపోదుగా అరె ఈ నేల ఆకాశం వుందే మనకోసం వందేళ్ల సంతోషం
అంతా మన సొంతం ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం
అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే అరె కనులను వెలిగించే ప్రతి
ఉదయం మనదేలే హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే
లాలాలా హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా
ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్న నా ఎద నీ
జతే కోరుతుందిగా ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడూ నీడగా వెంట
వుండవా అరె కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి కలిపేస్తూ నీ చెయ్యి
అడుగే చిందెయ్యి మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కధ కావాలి హేలా
హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా