Album: Neeli Rangu Cheeralona
Singer: Hariharan
Music: Yuvan Shankar Raja
Lyrics: Suddala Ashok Teja
Label: Aditya Music
Released: 2014-09-15
Duration: 04:45
Downloads: 2904313
నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు
రంగులున్న నడుము బొంగరంల తిప్పేదానా నిన్ను ఎట్ట అదుముకోనే ముద్దులిచ్చి
మురిపిస్తావే కౌగిలిచ్చి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్లె మెరిసే జాణ వరదల్లె
ముంచే జాణ ఈ భూమిపైన నీ మాయలోన పడనోడు ఎవడే జాణ
జాణ అంటే జీవితం జీవితమే నెరజాణరా దానితో సైయ్యాటరా ఏటికీ ఎదురీతరా
రాక రాక నీకై వచ్చీ పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత
బతుకున వచ్చే సుఖమనుకో పూవ్వులాగ ఎదురే వచ్చి ముల్లులాగ ఎదలో గుచ్చీ
మాయమయే భామవంటిదే కష్టమనుకో ఏదీ కడదాకా రాదని తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకోని వెయ్ రా అడుగెయ్ రా, వెయ్ జాణకాని
జాణరా జీవితమే నెరజాణరా జీవితం ఒక వింతరా ఆడుకుంటె పూబంతిరా
సాహసాల పొలమే దున్నీ పంట తీసె బలమే ఉంటే ప్రతీరోజు ఒక
సంక్రాంతి అవుతుందిరా బతుకు పోరు బరిలో నిలిచీ నీకు నీవే ఆయుధమైతే
ప్రతీపూట విజయదశమీయే వస్తుందిరా నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటే దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా
చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర
చెయ్యడానికే జన్మరా