Album: Sooryudinye
Singer: S.P. Balasubrahmanyam
Music: Mani Sharma
Lyrics: Suddhala Ashok Teja
Label: Aditya Music
Released:
Duration: 05:11
Downloads: 1364571
సూర్యుడే సెలవని అలసి పోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని
కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా
విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయెనా త్యాగం కధ
ఆదమరిచెనా దైవం వృధా సూర్యుడే సెలవని అలసి పోయేనా కాలమే
శిలవలే నిలిచిపోయేనా ఆకశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై
ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కల మనస్సు మనస్సున
రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసె నీ ప్రవచనం ప్రభోజ్వలా కదిలెనీ ఈ
యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా
(ఓం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనా
మృత్యోర్ ముక్షీయ మామృతాత్) స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే
అసురులై ఉరక లేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగములు
నడిపిన ధీరుడు మహొదయా అడి నువ్వే అనుకొని నిరీక్షతోనిలిచె ఈ జగతిని
మేలుకో రాదా మా దీపమై ఏలుకో రాదా మా బంధమై