Album: Lali Jo Lali Jo
Singer: S.P. Balasubrahmanyam
Music: Ilaiyaraaja
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2018-06-14
Duration: 04:47
Downloads: 689635
లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా
చేయి లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో
నా చేయి తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు కాపురం
చేస్తున్న పావురం ఒకటుంది ఆలినే కాదంది కాకినే కూడింది అంతలో ఏమైంది
అడగవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి మాయనే నమ్మింది
బోయతో పోయింది దెయ్యమే పూనిందో రాయిలా మారింది వెళ్ళే పెడదారిలో ముళ్ళే
పొడిచాకనే తప్పిదం తెలిసింది, ముప్పునే చూసింది కన్నులే విప్పింది, గండమే తప్పింది
ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి
పిల్లలూ, ఇల్లాలు ఎంతగా ఏడ్చారో గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు నేరం
నాదైనా భారం మీ పైన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా తల్లిలా
మన్నించు, మెల్లగా దండించు కాళిలా మారమ్మ, కాలితో తన్నమ్మా బుద్ధిలో లోపాలే
దిద్దుకోనీవమ్మ లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా
పట్టుకో నా చేయి