Album: Manasa Palakave
Singer: S. P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Koti, S.A. Raj Kumar, S.A. Rajkumar
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2003-09-15
Duration: 05:11
Downloads: 26795968
మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై
మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై మంచుతెరలే
తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా (తుమ్మెద
తుమ్మెద విన్నావమ్మా నిన్ను ఝుమ్మంటు రమ్మంది రంగేళి పూవమ్మా) మనసా
పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై నాలో
కులుకుల కునుకును రేపి లోలో తెలియని తలపులు రేపి పిలిచే వలపుల
వెలుగును చూపి లాగే రాగమిది నీలో మమతల మధువుని చూసి నాలో
తరగని తహతహ దూకి నీకై గలగల పరుగులు తీసి చేరే వేగమిది
ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా ఎడేడు జన్మాల బంధాలతో
ఈ నాడు నీ ఈడు పండించనా మరి తయ్యారయ్యే ఉన్నా వయ్యారంగా
సయ్యంటు ఒళ్ళోకి వాలంగా దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా చిన్నారి వన్నెల్ని ఏలంగా
ప్రతిక్షణం పరవశం కలగగా మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే
తెలుపవే చిగురాశల గీతికవై ఆడే మెరుపుల మెలికల జానా పాడే
జిలిబిలి పలుకుల మైనా రాలే తొలకరి చినుకులలోనా తుళ్ళే తిల్లానా వేగే
పదముల తపనలపైనా వాలే చినుకుల చెమటల వానా మీటే చిలిపిగ నరముల
వీణ తియ్యని తాళానా బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
అందాల మందారహారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా ఇక వెయ్యేళ్ళైనా నిన్ను
విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా నువ్వు వెళ్లాలన్నా ఇక వీల్లేదంటూ స్నేహాల
సంకెళ్ళు కట్టేయనా కాలమే కదలక నిలువగా మనసా పలకవే మధుమాసపు
కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై మంచుతెరలే తెరుచుకుని మంచి తరుణం
తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా