Album: Naalo Maimarapu
Singer: Mohana Bhogaraju
Music: Mickey J Meyer
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released: 2019-05-31
Duration: 03:48
Downloads: 4020643
నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా ప్రాయం పరదాలు తీసి
పరుగందుకుంటే ఎలా నాలో నాకే ఏదో తడబాటే పాతపూల గాలే
పాడుతుంటే లాలే కొత్త జన్మలాగా ఎంత చక్కగుందే చందమామ జారి చెలిమిలాగ
మారి గోరుముద్ద నాకే పెట్టినట్టు ఉందే నన్ను గారం చేసే
బాటసారి, ఎవరివోయి? నేను మారాం చేస్తే నవ్వుతావు, ఎందుకోయి? నా స్వరం
నన్నే కొత్తగా ఓయ్ అని పిలిచే తరుణం ఇలా ఈ క్షణం
శిలై మారితే లిఖించాలి ఈ జ్ఞాపకం నువ్వు నన్ను చూసే చూపు
నచ్చుతోంది నెమలి పించమల్లె నన్ను తాకుతోంది తేలికైన భారం, దగ్గరైన దూరం
సాగినంత కాలం సాగనీ ప్రయాణం దాచిపెట్టే నవ్వే కళ్ళలోనే తొంగి
చూసే సిగ్గు మొగ్గైపోయే గుండెలోనే పూలు పూసే నా ముఖం నాకే
ముద్ధుగా చూపెనే గదిలో అద్దం నిజంగా ఇది భలేగున్నది, ఈ తైతక్క
నాకెందుకు? ఆశలన్నీ మళ్ళీ పూస గుచ్చుతుంటే ఉన్నపాటు నేనే తుళ్ళిపడుతూ
ఉన్నా వయసు నన్ను గిల్లి, కాస్త ముందుకెళ్ళి ఊసులాడబోతే ఎందుకాపుతున్నా