Album: Nuvvasthanante
Singer: K. S. Chithra, Raqueeb Alam
Music: Devi Sri Prasad
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2014-05-17
Duration: 05:33
Downloads: 9053426
సినుకు రవ్వలో సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో (సినుకు
రవ్వలో సినుకు రవ్వలో) (చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో) పంచవన్నె చిలకలల్లె
వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలో సినుకు రవ్వలో
సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో సినుకు రవ్వలో
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్లని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్లి
పోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వొస్తానంటే
నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్లని దాక్కుంటావే పైన ముద్దులొలికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా ఝుంకాలాగా చేరుకోవే జిలుగుల చుక్కా చేతికి రవ్వల గాజుల్లాగా
కాలికి మువ్వల పట్టీలాగా మెళ్లో పచ్చల పతకంలాగా వగలకు నిగ నిగ
నగలను తొడిగేలా నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా ఆహా నువ్వొస్తానంటే నేనొద్దంటానా
తరికిట తరికిట త ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా
చిన్న నాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా కన్నె ఏటి
సోయగంలా నన్ను నీలో పోల్చుకోనా పెదవులు పాడే కిలకిల లోనా పదములు
ఆడే కథకళి లోనా కనులను తడిపే కలతల లోనా నా అణువణువున
నువు కనిపించేలా నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా నువ్వొస్తానంటే ఏయ్ ఏయ్ నేనొద్దంటానా
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్లని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే
చూసెళ్లి పోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా