Album: Hrudhayam
Singer: Hemachandra
Music: Mani Sharma
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2015-02-07
Duration: 03:48
Downloads: 7332383
హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం పెదవులు విడిరాక
నిలువవే కడదాక జీవంలో ఒదగవే ఒంటరిగా లోలో ముగిసే మౌనంగా
హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇక పై తలచుకోరానిది ఈ నిజం
ఊహాల లోకంలో ఎగరకు అన్నావే తేలని మైకంలో పడకని ఆపావే ఇతరుల
చిరు నవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా మరి నా కను పాపల్లో
నలుపై నిలిచావేమ్మా తెలవారి తొలి కాంతి నీవో బలి కోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇక
పై తలచుకోరానిది ఈ నిజం వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలిస్తాడూ అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడూ చెంతకి
చేరాడంటే చితిమంటే ఔతాడూ హలాహలం నాకు సొంతం నువు తీసుకో అమృతం
అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా హృదయం ఓర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరానిది ఈ నిజం