Album: Meghala Pallakilona
Singer: Sri Ram Prabhu, Sunitha Upadrasta
Music: Koti
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2014-04-07
Duration: 04:32
Downloads: 1172659
మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోన దిగి
వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా
గుడిలో దివ్వెలా గుండెలో మువ్వలా ఎగిరే గువ్వలా ఎదిగే పువ్వులా నవ్వవే
నిత్యం ఇలా ముత్యాల వానలా అందాల మందార కొమ్మా హోయ్ అల్లారు
ముద్దైన బొమ్మా నీలా నవ్వాలని నీతో నడవాలని పచ్చని పండుగ
వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరేళ్ల కాలానికి నువ్వే మారాణివంటున్నది
ప్రతి రోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన
ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల
పల్లకిలోన మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన
శశికళ చినుకులా కురిసిన హరివిల్లా నన్నే మరిపించగా నిన్నే మురిపించగా
ప్రతి రాతిరి వేళల్లో రాని చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో
కలలు నింపాలని నీకోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి
కన్నా రేపెంతో మిన్న చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం
మేఘాల పల్లకిలోన మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల
మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా